విమాన గోపురానికి వెండి తోర‌ణం బ‌హుక‌ర‌ణ‌..

విమాన గోపురానికి వెండి తోర‌ణం బ‌హుక‌ర‌ణ‌..

2
TMedia (Telugu News) :

విమాన గోపురానికి వెండి తోర‌ణం బ‌హుక‌ర‌ణ‌..
టి మీడియా,ఏప్రిల్ 01,తిరుమ‌ల‌ : తిరుమల శ్రీవారి ఆల‌యం బంగారు గోపురంపై ఉన్న విమాన శ్రీ వేంకటేశ్వరస్వామికి హైద‌రాబా ద్‌కు చెందిన‌ అగర్వాల్ 5 కేజీల స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన తోరణాన్ని విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి దాదాపు 5 లక్షల విలువ గ‌ల వెండి తోర‌ణాన్ని దాత అందించారు.ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజులపాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగం నిర్వహించనున్నారు. ఈ యాగానికి ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య అంకురార్పణ నిర్వహించ‌నున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్రహంతో శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్సరంలో ప్రజ‌లంద‌రూ ఆయురారోగ్యాల‌తో, సిరి సంప‌ద‌ల‌తో ఉండాల‌ని మూడు రోజుల పాటు యాగం నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Also Read : దశదిన కర్మకి హాజరైనఎమ్మెల్యే శంకర్ నాయక్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube