విశ్వకర్మ ఆరాధన ఉత్సవాలు
టీమీడియా,మే11 జగిత్యాల :జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక పవిత్ర గోదావరి నది తీరనా ఉన్న శ్రీ శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 329 వ ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం మాజీ మండల అధ్యక్షుడు ప్రస్తుత జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరికొండ అశోక్ చారి ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆలయ వేద పండితులు అర్చకులు అడ్లూరి ప్రశాంత్, ఓరుగంటి నరేష్ ఆధ్వర్యంలో స్వామివారికీ ప్రతేక పూజ కార్యక్రామలు నిర్వహించడం జరిగింది ఆలయ వేద పండితులు అర్చకులు ప్రశాంత్ మాట్లాడుతూ విశ్వకర్మ ఆరాధన ఉత్సవాలు అనగా నేడు స్వామివారు సజీవ సమాధి అయినా సందర్భాన్ని పురస్కరించుకోని ఆరాధన ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.
Also Read : అఖిల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
ఆరాధన ఉత్సవాలలో భాగంగా ఆలయ గర్భ గుడిలో ఉన్న స్వామివారి మూల విరాట్ కు నూతనంగా మండల మాజీ అధ్యక్షుడు ప్రస్తుత జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరికొండ అశోక్ చారి బహుకరించిన మకర తోరణం నాగ పడిగేను స్వామివారి మూల విరాట్ కు అలంకరించారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ దేవరకొండ గంగాధర్, మండల అధ్యక్షుడు కనుకుల స్వామి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మురళీ, జ్ఞానచారి, సత్యం, రవి, వీరేశం, రాజేశం, రమణ, ఆలయ సిద్ధాంతి లక్ష్మీ నారాయణ లతో పాటు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube