ముంపు గ్రామాలను సందర్శించిన అడిషనల్ డీజీపీ

ముంపు గ్రామాలను సందర్శించిన అడిషనల్ డీజీపీ

1
TMedia (Telugu News) :

ముంపు గ్రామాలను సందర్శించిన అడిషనల్ డీజీపీ
టి మీడియా,జూలై20,దుమ్ముగూడెం:
వరద బాధితులకు అండగా వుంటామని అడిషనల్ డీజీపీ వై. నాగిరెడ్డి అన్నారు.
వరద బాధితులకు భరోసా కల్పించేందుకు దుమ్ముగూడెం మండలం,మారుమూల అటవీ ప్రాంతమైన కాశీనగరం ముంపు గ్రామాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ,జిల్లా ఏస్పీ వినీత్, ఏఎస్పీ రోహిత్ గారితో కలసి సందర్శించారు. స్ధానిక ప్రజలలో మాట్లాడిన అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి గారు వరద ఆనంతరం తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి అవసరమైన సహాయ చర్యల అందించేందుకు ముంపు ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు.

 

Also Read : శ్రీశైలం డ్యాంకు తగ్గిన వరద ప్రవాహం

ప్రధానంగా వరద సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సదుపాయాలు సద్వినియోగం చేసుకొవాలని గ్రామస్తులకు సూచించారు. మరియు ఏ ఇతర సమస్యలు వున్న జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ముంపు వల్ల జరిగిన నష్టాన్ని ,సమస్యలు నమోదు కోసం వచ్చే రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా స్ధానిక సమస్యపై విన్నతులు అందజేస్తే తప్పనిసరిగా పరిష్కారం లభిస్తుందనే విశ్వాసాన్ని పెంపొందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube