దళిత బంధు అమలు చేయడం చారిత్రాత్మకం

యూనిట్స్ పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

దళిత బంధు అమలు చేయడం చారిత్రాత్మకం

-యూనిట్స్ పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
టీ మీడియా,జూన్ 29,చింతకాని:దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం పూర్తి స్థాయిలో దళిత బంధు పథకం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా నాగులవంచ, కోదుమూరు గ్రామంలో ఎస్సీ లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన JCB లు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, ట్రాలీ జీప్ లు తదితర యూనిట్స్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణి చేశారు.తొలుత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. ఆనంతరం దళిత బంధు పథకం క్రింద మంజూరైన యూనిట్స్ పంపిణీ చేశారు.

Also Read : పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన కార్పోరేటర్

ఈ సందర్భంగా హర్వెస్టర్ ను ఎక్కి నడిపారు. వాటిని పొందడం పట్ల ఆయా రైతులతో కసేపు ముచ్చటించారు. ఆనంతరం జరిగిన సభలో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. చింతకాని మండలంకు పూర్తి స్థాయిలో అమలు చేయడం చారిత్రాత్మకం అన్నారు.తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నుండి ఒక్కో మండలానికి పైలట్ ప్రాజెక్టు క్రింద తీసుకున్న వాటిలో చింతకాని మండలంను ఎంపిక చేసి, పూర్తి స్థాయిలో దళిత బంధు అమలు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.దాదాపు రూ.400కోట్ల ప్రభుత్వం నిధులతో దళితుల ఆర్థిక పురోగతిని కాంక్షించినందుకు సంతోషంగా ఉందన్నారు.కేవలం రెండు నెలల కాలంలో పథకం అమలుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఎంతో కృషి చేసిన ఆధికారులను మంత్రి పువ్వాడ అభినందించారు.డైరీ, షీప్, ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు, మినీ ఆటోలు వివిధ రకాల వ్యాపారాలు ఎర్పాటు చేసుకొని కూలీల స్థాయి నుండి యజమానులు గా నిలిచి మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికిఎదగడంగర్వకారణమన్నారు.దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం ఉద్దేశించిన దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని, తమ కాళ్ళ మీద తామే నిలబడినప్పుడే ఈ పథకానికి సార్థకత అవుతుందన్నారు.

Also Read : నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

ప్రయోగాత్మంగా ముందుగా నియోజకవర్గంకు 100 చొప్పున దళిత బందు అమలు చేశామని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుందని, ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి పువ్వాడ భరోసా కల్పించారు. దళిత కుటుంబాలు తమ కాళ్ళపై తాము నిలదొక్కుకుని సమాజంలోని అన్ని వర్గాల వారితో సమానంగా ఆర్ధిక ప్రగతిని సాధించాలని, మరో పది మందికి ఉపాధి కల్పించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. దళారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా, ఏ దశలోనూ అవినీతి, అక్రమాలకు తావు ఉండరాదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ గారు ఎలాంటి ఆంక్షలు, పరిమితులు విధించకుండా లబ్ధిదారుల పేరిట నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేయించారని, తొలి విడత కింద జిల్లాకు ఇప్పటికే నిధులు మంజూరై సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు.తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతితో ముందుకు పోతుందని, యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, 80వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఇదేదో రాజకీయ లబ్ది కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు సమాజంలోని వివిధ వర్గాల వారితో చర్చోపచర్చలు జరిపి ఎంతో మేధోమధనం చేసిన తరువాతనే దళితబంధుకు రూపకల్పన చేశారని తెలిపారు.

Also Read : భావి లో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

అరవై సంవత్సరాలుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో ఇంకనూ అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో వివిధ వర్గాలకు చెందిన వారితో సమాలోచనలు జరిపి పక్క ప్రణాళికతో దళిత బంధు కార్యక్రమాన్ని రూపొందించారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మనసుపెట్టి ఆచరణలోకి తెచ్చిన పథకం ఇది అని పేర్కొన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు, ష్యురిటీలు, బ్యాంకు కాంసేంట్ లేకుండానే నేరుగా లబ్ధిదారులకు పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదన్నారు. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని తమకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, తద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించాలన్నదే దళిత బంధు పథకం ఉద్దేశ్యమని చెప్పారు.

 

Also Read : ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత

వీటి స్థాపన పూర్తయిన వెంటనే మరో రెండు నెలల వ్యవధి లోపే మలి విడత కింద ఒక్కో సెగ్మెంట్ నుండి రెండు వేల మంది లబ్ధిదారులను దళిత బంధు కింద ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే తపనతో ముఖ్యమంత్రి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ గారు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు గారు, జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, MRO శైలజ గారు, కార్పొరేటర్ లు కమర్తపు మురళి గారు, రుద్రగాని శ్రీదేవి, తోట దనమ్మ, సరస్వతి, నాయకులు బొమ్మెర రాంమూర్తి గారు, AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న గారు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube