దళితబంధు నిధులతో ఆదాయం సంపాదించుకోవాల

దళితబంధు నిధులతో ఆదాయం సంపాదించుకోవాల

1
TMedia (Telugu News) :

దళితబంధు నిధులతో ఆదాయం సంపాదించుకోవాల

టీ మీడియా,అక్టోబర్ 28,భద్రాద్రి కొత్తగూడెం : దళితబంధు నిధులనే పెట్టుబడిగా పెట్టి అదనపు ఆదాయం సంపాదించి దళితులు అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో దళితబంధు, మన ఊరు – మనబడి కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, విద్యా, ఇంజనీరింగ్, మున్సిపల్ కమిషనర్లు, యంపిడిఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 421 మందికి దళితబంధు పథకాన్ని మంజూరు చేశామని, మంజూరైన అన్ని యూనిట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. యూనిట్లు నిర్వహణ తీరును అధికారులు పరిశీలించి లబ్దిదారులకు యూనిట్లు నిర్వహణపై సమగ్రమైన అవగాహన కల్పించాలని చెప్పారు. దళితబంధు నిధులను పెట్టుబడిగా పెట్టి అదనపు ఆదాయం సముపార్జించి వ్యాపారా వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టిందని, పథకం వినియోగంతో అభివృద్ధిని సాధించాలని చెప్పారు.

Also Read : “అనంత” మాయ

యూనిట్లును పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. యూనిట్లు నిర్వహణ తీరును పంచాయతీ కార్యదర్శులు, యంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. యూనిట్లు ఏర్పాటు ద్వారా లబ్దిదారులు సముపార్జించిన ఆదాయ, వ్యయాలపై నివేదికలు అందచేయాలని చెప్పారు. కొంతమంది లబ్దిదారులు యూనిట్లు నిర్వహణ బాగా చేస్తూ ఆదాయం గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, అటువంటి వారిని ఆదర్శంగా, స్పూర్తిగా తీసుకుని మిగిలిన లబ్దిదారులు యూనిట్లు మంచిగా నిర్వహించి ఆదాయం సంపాదించుకోవాలని చెప్పారు. యూనిట్లును మంచిగా నిర్వహించాలని యూనిట్లు నిర్వహణలో ఏదేని ఇబ్బందులు ఉంటే సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని, తగు అవగాహన కల్పిస్తారని, లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మన ఊరు, మనబడి కార్యక్రమంలో మరమ్మత్తులు పూర్తయిన పాఠశాలలకు రంగులు వేయు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతలో 368 పాఠశాలలు ఎంపిక కాగా 30 లక్షల కంటే తక్కువ వ్యయమయ్యే పాఠశాలలు 324 ఉన్నాయని, 30 లక్షలు పైబడి ఖర్చయ్యే పాఠశాలలు 44 ఉన్నాయని చెప్పారు.324పాఠశాలల్లోమరమ్మత్తుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.

Also Read : నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు

30 లక్షలు పైబడి మరమ్మత్తులున్న 44 పాఠశాలల్లో 37 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా 7 పాఠశాలల్లో పనులు నిర్వహణకు టెండర్ దశలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 5 పాఠశాలల్లో రంగులు వేయు ప్రక్రియ ప్రారంభం కాగా 47 పాఠశాలల్లో సోమవారం నుండి రంగులు వేయు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఉపాధి హామి పథకం ద్వారా చేపట్టే పనులకు సంబంధించి ఇబ్బంది ఉంటే ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు. మరమ్మత్తులు స్థాయిలను బట్టి తక్షణమే నిధులు మంజూరు చేసేందుకు యంబి రికార్డులు నమోదులు చేయాలని చెప్పారు. యంబి రికార్డులు నమోదులో జాప్యం జరిగితే నిధులు చెల్లించడానికి జాప్యం జరుగుతుందని, పూర్తయిన పనులను బట్టి వెంటనే యంబి రికార్డు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, దళితబంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు మధుసూదన్ రాజు, సంజీవరావు, వెంకటేశ్వర్లు, మరియన్న, సీతారాంనాయక్, విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, యంపిడిఓలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube