దళిత రత్న అవార్డ్ గ్రహీత పప్పుల వేణుగోపాల్

దళిత రత్న అవార్డ్ గ్రహీత పప్పుల వేణుగోపాల్

2
TMedia (Telugu News) :

దళిత రత్న అవార్డ్ గ్రహీత పప్పుల వేణుగోపాల్

టి మీడియా,జూన్21,ఖమ్మం : రాష్ట్రప్రభుత్వం దళితులు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలను గుర్తించి దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వారికి దళిత రత్న అవార్డును ప్రకటించింది. దళిత రత్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్,హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా కార్యదర్శి పప్పుల వేణుగోపాల్ అవార్డును అందుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులు నిరుపేదలకు ప్రజా గొంతుకలతో నిరంతరం సామాజిక ఉద్యమ ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ,జర్నలిస్ట్ గా బాధ్యతలు చేపట్టి దళితులపై అన్యాయాలను వ్యతిరేకించి వారి అభ్యున్నతికి పాల్పడినందుకు ఖమ్మం జిల్లా, రూరల్మండలంలోని అరేంపుల గ్రామానికి చెందిన పప్పుల వేణుగోపాల్ కు ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది.

Also Read : అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్కు ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు కు సన్మానం

ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ అనేక కార్యక్రమాలు చేశానని,సావిత్రి బాయి పూలె ఎడ్యుకేషన్ ద్వారా గ్రామాలలో నిరుపేద విద్యార్థులకు చదువుకోవడం వలన కలిగే లాభాలు అలాగే స్వేరో సర్కిల్ లో పనిచేస్తూ గురుకుల పాఠశాలలో విద్య గురించి,గురుకులాల్లో అంబేద్కర్ ఆశయాల గురించి,వీఎల్సీ నడపడం అనేక అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.కులాంతర వివాహాలపై అవగాహన కల్పించి చాలా వివాహాలు చేయడం జరిగిందని అన్నారు.ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని,ఇంకా బాద్యతగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి.రవి,జాతీయ ఉపాధ్యక్షుడు పడాల.భాస్కర్,రాష్ర్ట అధ్యక్షుడు చిక్కుడు.గుండాలు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ కుమార్,నర్సింగరావు,చెన్నకేశవులు,ముడుసు జాకబ్,ఇందిర, జయమ్మ,దేవి,కనకాల తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube