దళితులకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

దళితులకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

0
TMedia (Telugu News) :

దళితులకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

టీ మీడియా, జూన్ 11, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి లో దళితులకు స్మశాన వాటిక స్థలానికి ప్రభుత్వం వెంటనే కేటాయించాలని అని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ వనపర్తిలో దళితులకు సంబంధించిన స్మశాన వాటిక రోడ్డు అభివృద్ధి చేయడానికి స్మశాన వాటిక పూర్తిగా పోయిందని ఇప్పుడు దళితులకు స్మశాన వాటిక లేకుండా పోయిందని అనేకసార్లు కలెక్టర్ కి బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో దృష్టికి తీసుకపోవడం జరిగింది. అని నేటి వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదని అందుకే శుక్రవారం ఈ సమస్య గురించి ధర్నా చేయడం జరిగిందని వెంటనే స్మశాన వాటిక స్థలం కేటాయించపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

Also Read : పట్టణ ప్రగతి తో అభివృద్ధి సాధ్యం

ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రాష్ట్ర శ్రీశైలం ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, ఉపాధ్యక్షులు రామన్న, వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షులు రామ్ మోహన్, ప్రధాన కార్యదర్శి రాయన్న, ఓం ప్రకాశ్ చారి, బిజెపి జిల్లా కోశాధికారి శెట్టి, శీను, పెద్దిరాజు, బిజెపి దళిత మోర్చా నాయకులు కొమ్ము సామిల్, సుబ్రహ్మణ్యం, ధ్యారాపోగు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube