ధరణి వ్యవస్థను రద్దు చేయాలి
టీ మీడియా, నవంబర్ 24, వనపర్తి బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించి ప్రభుత్వానికి రాష్ట్రంలో ధరణి పోర్టర్ ద్వారా భూముల వివరాలు రైతులకు అందకుండా బి కేటగిరికి అని ఇంకా వివిధ కారణాల చేత రైతులకు అనేక సమస్యలు సృష్టించి వారిని ఎన్నో వేదనలకు గురి చేస్తున్న ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి వ్యవస్థ రద్దు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అట్టి హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు కావున రైతుకు లక్ష రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
Also Read : విద్యార్థులకు మంచినీటి సౌకర్యం
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు యాదయ్య, వనపర్తి పట్టణ నాయకులు చీర్ల జనార్ధన్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా, భాస్కర్ ,కాంగ్రెస్ పార్టీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, నాగరాజు, మన్నెం యాదవ్, పాండురావు, రాంజీ నాయక్, శాంతన్న, గంధం లక్ష్మయ్య, డి విజయ్, రవికుమార్, ఎల్లయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.