ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా

1
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా

టీ మీడియా,సెప్టెంబర్ 23, గోదారిఖని : సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జె.ఏ.సి. ఆధ్వర్యంలో గురువారం రామగుండం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా జె.ఏ.సి.నాయకులు బి.తిరుపతి,వేల్పుల కుమారస్వామి,తోకల రమేష్,రాజేందర్,హరీన్ లు మాట్లాడుతూ… 14 రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుంటే యాజమాన్యం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేకుండా లాభాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. తక్కువ జీతాలు ఇస్తూ శ్రమను దోపిడీ చేస్తూ వచ్చిన రూపాయాలే అధికారులు తీసుకుంటున్న లాభాలు అన్నారు.

Also Read : పల్లా శాంతమ్మ కు మంత్రి నివాళులు

 

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, ఎస్.సి.ఈ.యు.రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి,సీపీఐ నాయకులు కంది రాజరత్నం,న్యూ డేమోక్రసి నాయకులు అశోక్,ఐ.ఎఫ్.టి.యు.జిల్లా అధ్యక్షులు ఈదునూరి నరేష్,టి.ఎల్.పి.రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్, బీజేపీ నాయకులు కౌశిక హరి,ఎం.ఆర్.పి.ఎస్.నాయకులు మంద రవి,ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.మహేశ్వరి,డి.వై.ఎఫ్.ఐ. జిల్లా అధ్యక్షులు కె.సాగర్,చెంద్రశేఖర్,కరీం, బి.లింగయ్య,సిహెచ్.ఉపేందర్,జి.భూమయ్య,సంతోష్,అరవింద్,భూమయ్య,మనోజ్,వరలక్ష్మీ,స్వప్న,మదునమ్మ,శంకర్,సమ్మయ్య, ఓదెలు,లక్ష్మీనారాయణ,శంకర్,తిరుపతమ్మ,రాణి లతోపాటు అర్జీ-1,2,3,ఏరియాల నుండి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube