సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా వనపర్తి అక్టోబర్ 29 : ఐకెపి వివోఏల సంగం, సిఐటియు అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఆర్డిఎ పిడి కార్యాలయం ముందు శుక్రవారం రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, జిల్లా కార్యదర్శి శాంతయ్య పాల్గొని ప్రసంగిస్తూ ఐకెపి వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని వివోఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం 1000000 ఇవ్వాలని కనీస వేతనం 21000 రూపాయలు ఇవ్వాలని గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి నెలా ఒకటో తారీఖున వారి అకౌంట్ లో వేతనాలు వేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా డిఆర్డిఎ పిడికి తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐకెపి వివోఏలా సంఘం నాయకులు దేవేందర్, చందు, బాలరాజు ,రాజగౌడు ,భాస్కర్, ఇంద్రావతి ,ఈశ్వరమ్మ, అలివేల తదితరులు పాల్గొన్నారు.

A dharna was held on friday in front of the DRDA PD office under the auspices of the IKP VVOA Association.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube