జూనియర్ డాక్టర్ల ధర్నా

-ఏడు నెలలుగా అందని స్టయి ఫండ్

0
TMedia (Telugu News) :

జూనియర్ డాక్టర్ల ధర్నా

-ఏడు నెలలుగా అందని స్టయి ఫండ్

టీ మీడియా, డిసెంబర్ 27,విజయనగరం కోట : విజయనగరం సర్వజన హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు ఈరోజు ఉదయం నుంచి ధర్నాకు దిగడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ”నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ కొత్త కాలేజీలు పెడుతున్నాం ఇందులో జాయిన్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రభుత్వ పరంగా మీకు అన్ని అవకాశాలు వస్తాయి. స్టయి ఫండ్ కచ్చితంగా ఇస్తామని చెప్పారు. కానీ మేము జాయిన్ అయి 7 నెలలు గడుస్తున్నా ఎటువంటి స్టైఫండ్ రాలేదు. దీనివలన మేము అనేక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటి దగ్గర నుంచి నెల, రెండు నెలలు డబ్బులు తెచ్చుకొని ఖర్చు చేసుకోగలం గాని ఇన్ నేషనల్ అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడు నెలలకు గాను ఒక్కొక్క డాక్టర్ కు 1,57,500/-రూపాయలు ఒక్కొక్కరికి రావాల్సి ఉంది. ఎంతెంత డబ్బులు పెట్టుకొని ఉద్యోగాలు చేయాలంటే చాలా ఇబ్బందులుగా ఉంది. జాయిన్ అయినప్పుడు చెప్పింది ఒక మాట ఇప్పుడు ఒకలా జరుగుతుంది అన్నారు.

Also Read : నేటి(28) నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.

ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ తో సమానంగా స్టైఫండ్ ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు, మేము సీనియర్స్ డాగ్స్ తో పాటు సమానంగానే డ్యూటీలు నిర్వర్తించడం జరుగుతుంది వారికి సకాలంలో జీతాలు ఇస్తున్నారు. మాకు ఎందుకు ఇవ్వటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా మీరు విదేశాల్లో చదువుకొని వచ్చారు. ఇక్కడ ఎందుకు ఇవ్వాలి అనే విధంగా కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మాకు డ్యూటీలు వేస్తున్నారు అక్కడ ఎటువంటి భోజన సౌకర్యం గాని విశ్రాంతి సౌకర్యాలు గాని ఏర్పాటు చేయలేకపోవడం వలన డ్యూటీలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని” వారి ఆవేదన వ్యక్తం చేశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube