టీ మీడియా చింతకాని
హైదరాబాద్ లో మిరప తోట సాగు చేసినరైతులతో కలిసి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదురుగా జరిగే ధర్నా కార్యక్రమంలో చింతకాని మండలం రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళినారు. మిరప పంటకు కొత్తరకం తెగలు
తోనష్టంజరుగుతుందని ,దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి, లక్షన్నర నష్టపరిహారం ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ జరిగే ధర్నా కార్యక్రమంలో మండలానికి సంబంధించిన రైతు నాయకులు కొండపర్తి గోవిందరావు, ఏపూరి రవీంద్ర బాబు, పావులూరి మల్లికార్జునరావు, మండల కార్యదర్శి కూచిపూడి రవి, అబ్బూరి మహేష్, కొండపర్తి బాలాజీ ,కృష్ణనరసింహారావు,రాంబాబు చిట్టి గోవర్ధన్, వెంకట్ రెడ్డి చలమల అనిల్, రాంబాబు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.