ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా

ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా

1
TMedia (Telugu News) :

 

ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా

టి మీడియా, సెప్టెంబర్ 23 ,ఖమ్మం : ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, అర్హులైన పేదలకు 120 గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ. 5 లక్షలు తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రజా సంఘాల పోరాటవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో ఆందోళన నిర్వహించారుఅంతకుముందు స్థానిక సుందరయ్య భవన్ నుంచి గట్టయ్య సెంటర్, వైరారోడ్డు మీదుగా ర్యాలీగా కలెక్టరేట్ ధర్నా చౌక్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 

Also Read : బతికున్న మహిళ చనిపోయిందని పొలం రిజిస్ట్రేషన్‌..

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వరరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, నాయకులు మెరుగు రమణ, రమ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube