ఉపాధ్యాయులు,విద్యార్థులు ధర్నా

ఉపాధ్యాయులు,విద్యార్థులు ధర్నా

1
TMedia (Telugu News) :

 

హెచ్ ఎం తీరును నిరసిస్తూ..
ఉపాధ్యాయులు,విద్యార్థులు ధర్నా
– అధికారులు జోక్యం తోకొలిక్కి
టీ మీడియా, సెప్టెంబర్ 20,ఖమ్మం: విద్యార్థులు కు మంచి బుద్దులు,ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా ఉండాల్సిన హెచ్ ఎం అందరినీ ఇబ్బందుల కు గురి చేస్తున్న వైనం ఖమ్మం లో వెల్లడి అయింది. గత్యంతరం లేనిపరిస్తుల్లో విద్యార్థులు తో కలిసి టిచర్లు మంగళ వారం ధర్నా చేశారు. వివరాలు పరిశీలిస్తే.

 

నగరం లోని రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్న గర్ల్స్ పాఠశాలలో శారద హెచ్ ఎం గా ఉన్నారు.ఆమె గతం ఖాజిజపుర పాఠశాలలో పని చేశారు.అప్పుడు అక్కడి వారిని వేధించారు అన్న ఆరోపణ ల తో చర్యలకు గురి అయ్యారు.అనంతరం కొన్ని రోజులు అన్నం పౌండేష న్ లో ఉన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి ఎర్ర గడ్డ అసపత్రి కి పరీక్షలు చేయించు కోవాలి అనంతరం వచ్చే వైద్యులు నివేదిక ఆధారం గా పోస్టింగ్ ఇస్తామని అన్నారు.అవి ఏమి లేకుండానే ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు.ఆమె మాత్రం కొత్త చోట మునుపటి విధంగానే ఇబ్బందులు కు గురి చేస్తున్నారు .ఈ విషయాలు గురించి ప్రస్థుత చోట అధికారులు కు పిర్యాదులు వెళ్ళాయి. విచారణ జరుగు తుండగానే సిబ్బంది వద్ద ఉండే స్కూల్ రికార్డులు,వేతనా ల రిగిస్టర్లు తన స్వంత బీరువాలో పెట్టుకొని తాళం వేసి కొంది. డి ఈ ఓ వద్దకు వెళ్లి లాంగ్ లీవ్ పై వెళ్లి పోయారు.ఇంఛార్జి ఇవ్వలేదు.తిరిగి స్కూల్ సిబ్బంది పిర్యాదు తో మంగళ వారం తిరిగి స్కూల్ కి శారద వచ్చింది అందరి పై విరుచుకు పడింది.ఆ విషయం ధర్నాకు దారి తీసి ఉద్రిక్తత కు దారి తీసింది.పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకొన్నారు.సి ఐ జోక్యం మేరకు ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube