ముంపు బాధితులకు దుప్పట్లు వితరణ

సిపియం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

1
TMedia (Telugu News) :

 

ముంపు బాధితులకు దుప్పట్లు వితరణ

-సిపియం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

టి మీడియా, ఆగస్టు 3 ,వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రములో స్థానిక బస్ స్టాండ్ ముందు సిపియం మండల కార్యాలయంను ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఈ పార్టీ కార్యాలయం నిత్యం పేద , బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పని చేయాలని ఆయన సూచించారు.సిపియం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని చర్చిపేట , మహాలక్ష్మీ , వీధిలో గోదావరి ముంపు బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు.

Also Read : ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సు

ఈ కార్యక్రమంలో సిపియం పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు , మాట్లాడుతూ పేద ప్రజల కోసం గోదావరి ముంపు బాధితులకు చేయూతగా ఈ గ్రామాల లో 30000 వేల రూపాయల విలువ గల దుప్పట్లు పంపిణీ చేశామని అన్నారు .ఈ కార్యక్రమంలో సిపియం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను జిల్లా కమిటీ సభ్యులు వంకా రాములు, వాసు, దావూద్, సాంబశివ , చిట్టెం ఆదినారాయణ, చారి, మాణిక్యం, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube