ఎప్పుడైనా పార్టీ మారతానని చెప్పానా

-మీడియానే ముహూర్తం ఫిక్స్ చేసింది

1
TMedia (Telugu News) :

ఎప్పుడైనా పార్టీ మారతానని చెప్పానా

-మీడియానే ముహూర్తం ఫిక్స్ చేసింది

– మాజీ మంత్రిగంటా శ్రీనివాసరావు

టీ మీడియా, డిసెంబర్ 12,విశాఖ : పార్టీ మార్పుపై జోరుగో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాతో పాటూ కొన్ని మీడియా ఛానళ్లలో ఈ నెలలోనే పార్టీ మారతారని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. తాజాగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెట్టారు. మీడియానే తాను మారేందుకు టైం కూడా ఫిక్స్ చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే కాదు.. చాలా పార్టీలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు గంటా.మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ లోకి వెళతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలపై మాజీ మంత్రి కుండబద్దలు కొట్టేశారు. రాజకీయ ప్రస్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. విశాఖలో జరిగిన కాపునాడు కార్యక్రమంలో గంటా పార్టీ మార్పుపై స్పందించారు. తన ప్రమేయం లేకుండానే పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతోందని.. తన ప్రమేయం లేకుండానే డేటు, టైం కూడా ఫిక్స్ చేస్తారని మండిపడ్డారు. ఏం రాసుకున్నా.. ఏం ప్రచారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. అవసరమైన సందర్భంలో తానే చెప్పాల్సింది చెప్తాను అన్నారు.మరోవైపు కాపునాడు బహిరంగ సభకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తానన్నారు గంటా. బడుగు,బలహీన వర్గాలకు ఆశాజ్యోతి వంగవీటి రంగా.. అంబేద్కర్ వంటి మహనీయులు తర్వాత దేశంలో ఎక్కువ విగ్రహాలు ఉండేవి వంగవీటి రంగావే అన్నారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళేద్దుకు ప్రయత్నం చేస్తామని.. రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయని.. రెండు కాదని వ్యాఖ్యానించారు.తాను పలానా పార్టీలో చేరుతాను అన్నది ప్రచారం మాత్రమే అన్నారు గంటా. మీడియానే ముహుర్తాలు పెట్టి, తేదీలు ఖరారు చేస్తున్నారన్నారు. తాను ఎప్పుడైనా పార్టీ మారుతానని చెప్పానా అన్నారు. ఒకవేళ ఎప్పుడైనా పార్టీ మారే ఆలోచన ఉంటే తానే చెబుతాను అన్నారు. కాపునాడు బహిరంగ సభ లక్ష్యం ఎంటో రానున్న కాలంలో స్పష్టత వస్తుందన్నారు మాజీ మంత్రి.10 రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన వైఎస్సార్‌సీపీ పెద్దలతో చర్చలు జరిపారని.. పుట్టిన రోజు తర్వాత నిర్ణయంతీసుకుంటారని హడావిడి నడిచింది. ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఆయన సమక్షంలో చేరిక ఉంటుందని టాక్ వినిపించింది. గంటా మాత్రం అసలు స్పందించలేదు.. పార్టీ మారతానని ఎక్కడా చెప్పలేదు.

Also Read : ఎమ్మెల్సీ అనంతబాబుకు కండిషన్ బెయిల్

ఆ తర్వాత గంటా పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వీడియోలో తాను టీడీపీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం చేశఆరు. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాతి వీడియో అని తేలిందివిశాఖ జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి టీడీపీకి, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలోని కార్యక్రమాలకు.. పార్టీ ఆఫీసుకు మాత్రం వెళుతున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లినా దూరంగా ఉన్నారు. కాకపోతే ఒకటి, రెండు సందర్భాల్లో టీడీపీ అధినేతను ప్రైవేట్ కార్యక్రమాల్లో కలిశారు.ఈ హెయిర్ కర్లర్‌లతో మీ కురులను మరింత స్టయిల్‌గా మార్చుకొని డిఫరెంట్‌గా & ఫ్యాషన్‌గా కనిపించండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube