కల్తీ మద్యం తాగి స్కూల్‌ ప్రిన్సిపల్‌ సహా ముగ్గురు మృతి

కల్తీ మద్యం తాగి స్కూల్‌ ప్రిన్సిపల్‌ సహా ముగ్గురు మృతి

1
TMedia (Telugu News) :

కల్తీ మద్యం తాగి స్కూల్‌ ప్రిన్సిపల్‌ సహా ముగ్గురు మృతి

టీ మీడియా, డిసెంబర్ 3, పాట్నా: బీహార్‌ కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాణ నిషేధం విధించింది. అయినప్పటికీ మందు ఏరులైపారుతున్నది. అయితే కల్తీ మద్యం తాగి జనాలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా మరో ముగ్గురు బలయ్యారు. వైశాలి జిల్లాలోని మెహ్నర్‌లో జరిగిన విందుకు ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ హాజరయ్యాడు. ఈ సందర్శంగా మద్యం సేవించాడు. దీంతో అనారోగ్యానికి గురైన అతడు మరణించాడు. ఇదే తరహాలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న మరో ఇద్దరు కూడా చనిపోయారు.

Also Read : త‌వ్వ‌కాలు జ‌రుగుతుండ‌గా కూలిన గ‌ని

ఈ మరణాలపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. వారి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాల్సిందిగా వైద్యులను కోరారు. అనుమానాస్పదంగా మృతిచెందినా, మద్యం సేవించి చనిపోయినా తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube