జోహార్ యనమదల జోషి..

సిపిఎం నేత వై.విక్రమ్ తండ్రి మృతి

1
TMedia (Telugu News) :

జోహార్ యనమదల జోషి…

సిపిఎం నేత వై.విక్రమ్ తండ్రి మృతి

టీ మీడియా,అక్టోబర్ 1, ఖమ్మం : కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న CPM పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ వై.విక్రమ్ తండ్రి యనమదల జోషి ఖమ్మం ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజుమరణించారు…బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో జోషీ నివాసం… గ్రామంలో CPM పార్టీ సానుభూతిపరులుగా వున్నారు. ప్రారంభం నుంచి యనమదల కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు. జోషి తల్లి యనమదల కమలమ్మ బోనకల్లు మండలం మొదటి మహిళా సంఘం (ఐద్వా) అధ్యక్షురాలుగా యనమదల కమలమ్మ పని చేశారు .గత కొంత కాలంగా అనారోగ్యంతో వున్న జోషి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులుగా ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయారు..

Also Read : యాదాద్రి అభివృద్ధికి రూ.43కోట్లు సీఎం కేసీఆర్‌

పెద్ద కుమారుడు హైదరాబాద్ లో ఆర్కిటెక్ట్ గా, రెండు కుమారుడు CPM పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా వుంటూ, ప్రస్తుతం జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు వున్నారు..అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం స్వగ్రామం రావినూతల లో జరుగుతాయని వై.విక్రమ్ తెలిపారు. CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, తదితర ఇతర జిల్లా నాయకులు జోషి మృతి పట్ల సంతాపం తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube