కేంద్రం గుప్పిట్లోకి డిజిటల్ మీడియా
టీ మీడియా, జులై 16,న్యూఢిల్లీ, జూలై 15: మీడియాను నియంత్రించే వివాదాస్పద ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్ 2019’ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తేబోతున్నది. ప్రింట్, డిజిటల్ మీడియా సంస్థలకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ రూపొందించిన ఈ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని జాతీయ మీడియా వెల్లడించింది. బ్రిటిష్ పాలనాకాలంలో రూపొందించిన ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్-1867 స్థానంలో ఈ బిల్లును చట్టంగా మార్చాలని మోదీ సర్కారు భావిస్తున్నది.
న్యూస్ పేపర్లకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ విధానం అమల్లో ఉండగా, కొత్త బిల్లు చట్టంగా మారితే న్యూస్ పోర్టళ్లు, కంప్యూటర్, మొబైల్ ఆధారిత వార్తా మాధ్యమాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్లు ద్వారా మోదీ సర్కారు మీడియాను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నదని 2019లో అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో దానిని పక్కనబెట్టింది. మళ్లీ ఇప్పుడు దానిలో కదలిక వచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube