డిజిటల్ సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకోండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 9 వనపర్తి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిగా భావించే సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో పార్టీ జండా కార్యక్రమం నిర్వహించి పార్టీ జెండా ఎగరవేసిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నూరు జయకర్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు అనంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మండలంలోని 45 పోలింగ్ బూతుల్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని కాంగ్రెస్పార్టీ కుటుంబంలో చేరాలని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త వారి వారి గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్లలో అధికశాతం సభ్యత్వాలు చేయించి వనపర్తి నియోజకవర్గంలోని ఖీల్లాఘణపురం మండలం అత్యధిక డిజిటల్ సభ్యత చేసిన మొదటి స్థానంలో నిలపాలని అందుకు నాయకులు కార్యకర్తలు కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దేవన్నయాదవ్, లింగస్వామి యాదవ్, నారాయణ, చెన్నయ్య ,గౌస్ ,మల్లయ్య, నరేందర్ ,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube