లోక్‌స‌భ ఎంపీగా డింపుల్ యాద‌వ్ ప్ర‌మాణ స్వీకారం

లోక్‌స‌భ ఎంపీగా డింపుల్ యాద‌వ్ ప్ర‌మాణ స్వీకారం

1
TMedia (Telugu News) :

లోక్‌స‌భ ఎంపీగా డింపుల్ యాద‌వ్ ప్ర‌మాణ స్వీకారం

టీ మీడియా, డిసెంబర్ 12, న్యూఢిల్లీ : యూపీలోని మొయిన్‌పురి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నికైన‌ స‌మాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాద‌వ్ సోమ‌వారం పార్ల‌మెంట్‌లో ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. బీజేపీ అభ్య‌ర్ధిపై ఆమె ఘ‌న విజ‌యం సాధించారు. ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన డింపుల్ యాద‌వ్‌ను ప‌లువురు అభినందించారు. మ‌రోవైపు లోక్‌స‌భ‌లో ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ అన్ని క‌రెన్సీల‌తో రూపాయి మార‌కం విలువ బ‌ల‌ప‌డింద‌ని చెప్పారు. రూపాయితో డాల‌ర్ విలువ భారీగా పెర‌గడాన్ని నిరోధించేందుకు అవ‌స‌ర‌మైతే విదేశీ మార‌క‌ద్ర‌వ్య నిల్వ‌ల‌ను ఉప‌యోగించి క‌రెన్సీ మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుంద‌ని ఆమె పేర్కొన్నారు.

Also Read : టీ కాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు

ఇక ఇంధ‌న సంర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని విద్యుత్‌, పునరుత్పాద‌క ఇంధ‌న మంత్రి ఆర్‌కే సింగ్ నేడు రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈనెల 9న బీజేపీ ఎంపీ కిరోది లాల్ మీనా రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఉమ్మ‌డి పౌర స్మృతిని విప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube