పెరూ దేశాధ్య‌క్షురాలిగా దినా బొలార్టే

పెరూ దేశాధ్య‌క్షురాలిగా దినా బొలార్టే

1
TMedia (Telugu News) :

పెరూ దేశాధ్య‌క్షురాలిగా దినా బొలార్టే

టీ మీడియా, డిసెంబర్ 8, లీమా: పెరూ దేశానికి తొలిసారి ఓ మ‌హిళ దేశాధ్య‌క్షురాలయ్యారు. దినా బొలార్టే బుధ‌వారం రాజ‌ధాని లిమాలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. అధ్య‌క్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంస‌న ద్వారా తొల‌గించారు. ఈ నేప‌థ్యంలో ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అభిశంస‌న త‌ర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబ‌సీకి వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.దినా బొలార్టే వ‌య‌సు 60 ఏళ్లు. ఆమె ఓ లాయ‌ర్‌. జూలై 2026 వ‌ర‌కు తానే అధికారంలో ఉండ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. రాజ‌కీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోవాల‌ని ఆమె అన్నారు. కొంత స‌మ‌యం ఇస్తే దేశాన్ని కాపాడుతాన‌ని ఆమె తెలిపారు. నిజానికి చాలా నాట‌కీయంగా పెడ్రో తొల‌గింపు ప్ర‌క్రియ జ‌రిగింది.

Also Read : ఇంటికి 3 లక్షలు.. రూల్స్‌ ఖరారు

టీవీలో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న దేశంలో అత్య‌యిక స్థితిని ప్ర‌క‌టించారు. కానీ పెడ్రో తీరును ఆగ్ర‌హించిన ఎంపీలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. సుమారు 101 మంది నేత‌లు ఆయ‌న‌పై అభిశంస‌న ప్ర‌క‌టించాయి. ఆ త‌ర్వాత పెడ్రోను పోలీసులు అరెస్టు చేశారు. పెడ్రో భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube