ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

1
TMedia (Telugu News) :

ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

టీ మీడియా, సెప్టెంబర్ 11 ,చిన్నంబావి:

చిన్నంబావి మండలం లోనీ పలు గ్రామాల్లో పెద్ద దగడ,అయ్యవారిపల్లి, కాలూరు, చెల్లెపాడు,కొప్పూనూర్,దగడపల్లి, వెలగొండ,మియ్యపూర్,బెక్కెం, గ్రామాలకు చెందిన 894 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను పలు గ్రామాల్లో నీ రైతు వేదికలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజక వర్గానికి 9033 పింఛన్లు మంజూరు అయ్యాయని చిన్నంబావి మండలానికి 892 వచ్చాయని తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 46లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు.గత పాలకుల హయాంలో వృద్ధులకు పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని, కానీ కేసీఆర్‌ గారు సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు.బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత భారీగా పింఛన్లు లేవని విమర్శించారు.అభివృద్ధిలో తెలంగాణను మేటిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

Also Read : మునుగోడు అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వాలి

ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కేసీఆర్ ఆని, అర్హులైన ప్రతి పేదవారికి పెన్షన్‌ తప్పక ఇస్తామ‌న్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ అందజేస్తామన్నారు.చిన్నంబావి మండల ప్రతి చివరి ఆయకట్టుకు నీరందించేందుకు కృషి చేస్తున్నానని దేవరకొండ నుంచి అలంపూర్ ఎక్స్ రోడ్ వరకు వయా కొల్లాపూర్,చిన్నంబావి మీదుగా మరొక నూతన హైవేకు ప్రతిపాదనలు పంపామని హైవే మంజూరు అయితే చిన్నంబావి చౌరస్తా ఒక పెద్ద జంక్షన్ గా మారబోతుందని మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు.సింగోటం గోపాల్దిన్నె లింకు కెనాల్ పనులు జరుగుతున్నాయని, పూర్తి అయితే వీపనగండ్ల, చిన్నంబావి మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.

Also Read : భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ,జెడ్పీటీసీ వెంకట రమణమ్మ,సింగిల్ విండో చైర్మన్ నరసింహ రెడ్డి,తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ఈదన్న యాదవ్,ఉమ్మడి మండల బాధ్యులు శ్రీధర్ రెడ్డి,సీనియర్ నాయకులు చిన్నారెడ్డి,ఇంద్ర సేన రెడ్డి,శ్రీధర్ రెడ్డి,సర్పంచ్ లు మధు,రామస్వామి,కౌసల్య,చక్రధర్ గౌడ్,సత్యరాణి,పద్మ,ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్,ప్రజా ప్రతినిధులు,అధికారులు,టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube