ఈ ఐ-ఫోన్ల‌పై మెగా డిస్కౌంట్లు..

ఇవీ డిటైల్స్‌

1
TMedia (Telugu News) :

ఈ ఐ-ఫోన్ల‌పై మెగా డిస్కౌంట్లు.. ఇవీ డిటైల్స్‌
టీ మీడియా, ఏప్రిల్ 5 ,న్యూఢిల్లీ :టెక్ దిగ్గ‌జం ఆపిల్‌కు చెందిన ఐఫోన్ కొనుక్కోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. ఆపిల్ సైతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌స్ట‌మ‌ర్ల మ‌న‌స్సు దోచేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తుంది. డిజైన్‌,కెమెరాలు,వాటిప‌నితీరుతోఐఫోన్లుఅభిమానుల‌నుసంపాదించుకుంటున్నాయి. ఈ వేస‌విలో ఐఫోన్ కొనుగోలు చేయాల‌ని భావిస్తున్నారా.. ఆపిల్ ఐ-స్టోర్ ఇండియా, రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, విజ‌య్ సేల్స్‌ల్లో ఐఫోన్ల‌పై భారీగా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌త్యేకించి ఐఫోన్‌12, ఐఫోన్ 13 మోడ‌ల్ ఫోన్ల‌పై ఆక‌ర్ష‌ణీయ డీల్స్‌, డిస్కౌంట్లు ఉన్నాయి.
రూ.38,990ల‌కే ఐఫోన్‌12ఆన్‌లైన్‌లో ఐఫోన్‌-12 కొనుగోలు చేయాలంటే రూ.65,900 చెల్లించాల్సిందే. కానీ, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌లో ఇప్పుడ‌ది రూ.38,990ల‌కే ఆపిల్ ఐ-స్టోర్‌లో ల‌భ్యం అవుతుంది. క‌స్ట‌మ‌ర్లు చేయాల్సింద‌ల్లా ఆపిల్ అనుబంధ పార్ట‌న‌ర్ వెబ్‌సైట్లు. స‌ర్వీఫై లేదా క్యాషిఫై ద్వారా త‌మ పాత స్మార్ట్ ఫోన్ల‌ను ఎక్చ్చేంజ్ చేయాలి. అలా చేస్తే రూ.38,990ల‌కే కొత్త ఐఫోన్ 12 పొందొచ్చు.

Also Read : ప్ర‌కాశ్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

ఆన్‌లైన్‌లో ఐఫోన్‌12 ధ‌ర రూ.65,900
సాధార‌ణంగా ఆన్‌లైన్ రేట్ ప్ర‌కారం కొనుగోలు చేసినా రూ.65,900 చెల్లించాలి. ఆపిల్ ఐ-స్టోర్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.5000 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. హెచ్డీఎఫ్సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మ‌రో రూ.4000 క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ఉంది. అంటే రూ.56,900ల‌కు ఐఫోన్‌12 ల‌భిస్తుంది.
ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌లో రూ.18 వేల డిస్కౌంట్‌
పాత‌ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ ద్వారా యూజ‌ర్లు రూ.18 వేల డిస్కౌంట్ అందుకోవ‌చ్చు. ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ సామ‌ర్థ్యం గ‌ల పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే సైట్ డిస్కౌంట్‌, కార్డ్ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ క‌లిపితే క‌స్ట‌మ‌ర్లు ఐఫోన్‌12ను రూ.38,990ల‌కే అందుకోవ‌చ్చు.

Also Read : ప్ర‌కాశ్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

ఐఫోన్‌13 కూడా చౌక‌
ఐఫోన్‌13 కొనుగోలు చేయాల‌ని భావించే ఆపిల్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌. ఐఫోన్ అస‌లు ధ‌ర రూ.84,990. ఇటీవ‌లే మార్కెట్‌లో విడుద‌ల చేసిన ఈ ఐఫోన్‌పై రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, విజ‌య్ సేల్స్ ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. విజ‌య్ సేల్స్ నేరుగా ఐఫోన్‌13 కొనుగోలుదారుల‌కు రూ.6000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్న‌ది. హెచ్డీఎఫ్సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేసే క‌స్ట‌మ‌ర్ల‌కు క్యాష్ బ్యాక్‌, డిస్కౌంట్లు ఉన్నాయి.
ఈఎంఐ.. నాన్ఈఎంఐ డిస్కౌంట్లు ఇలా
నాన్‌-ఈఎంఐ లావాదేవీల‌పై ఐదు శాతం అద‌నంగా (రూ.1500 వ‌ర‌కు) డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈఎంఐ లావాదేవీలైతే రూ.3000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక పాత ఫోన్ ఎక్స్చేంజ్ కింద కొనుగోలు చేయాల‌ని భావించే వారికి దాని కండీష‌న్‌ను బ‌ట్టి స్టోర్‌లు ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. దీని ప్ర‌కారం ఐఫోన్‌13పై విజ‌య్ సేల్స్ రూ.58,990ల‌కే అందిస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube