రాహుల్‌పై పిల్‌ కొట్టివేత.. పిటిషనర్‌కు జరిమానా

రాహుల్‌పై పిల్‌ కొట్టివేత.. పిటిషనర్‌కు జరిమానా

0
TMedia (Telugu News) :

రాహుల్‌పై పిల్‌ కొట్టివేత.. పిటిషనర్‌కు జరిమానా

– సుప్రీం ఆదేశాలు

టీ మీడియా, అక్టోబర్ 21, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాలు చేస్తున్న పిల్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది. పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. పిటిషనర్‌ ప్రాథమిక హక్కులేవీ ఉల్లంఘించబడలేదని, కేవలం చట్టక్రమాన్ని ఈ పిటిషన్‌ దుర్వినియోగం చేసిందని జస్టిస్‌ బి.ఆర్‌.గవారు నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది. రాహుల్‌ గాంధీ సభ్వత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది అశోక్‌ పాండే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. మోడీ ఇంటి పేరు గురించి 2019లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో రాహుల్‌ నేర నిరూపణపై ఆగస్టు 4న సుప్రీం కోర్టు స్టే విధించింది.

Also Read : ఏపీలో పోలీస్‌ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

ఈ ఏడాది మార్చిలో హైకోర్టు నేర నిరూపణ చేసి, రెండేళ్ల జైలు శిక్ష విధించిన వెంటనే లోక్‌సభ సభ్యత్వానికి రాహుల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆగస్టు 4న సుప్రీంకోర్టు ఆ తీరుపై స్టే ఇవ్వడంతో లోక్‌సభ సచివాలయం రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube