మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

- మణిరామ్ సి౦గ్

0
TMedia (Telugu News) :

మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

– మణిరామ్ సి౦గ్

టీ మీడియా, ఫిబ్రవరి 16, బెల్లంపల్లి : బెల్లంపల్లి టి.ఎన్.టి.యు.సి ఆఫీసులో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి కేటీకే 18 లైన్లు లో గనిలో జరిగిన ప్రమాదానికి ప్రకాష్ అనే మైనింగ్ సర్దార్ కు ప్రమాదానికి ఇలాంటి సంబంధం లేకున్నా అతన్ని బాధ్యునిగా చేస్తూ సింగరేణి యజమాన్యం క్రమశిక్షణ చర్యల పేరుతో యజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగించడ నీ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి.ఎన్.టి.యు.సి ప్రధాన కార్యదర్శి టి మణి రామ్ సింగ్ ఖండించారు మైనింగ్ సిబ్బంది బొగ్గు ఉత్పత్తి రక్షణ చర్య లో కీలక పాత్ర పోషిస్తున్నారని అలాంటి వారిని యజమాన్యం వేధింపులకు గురి చేయడం అన్యాయం అన్నారు అలాగే మైనింగ్ సిబ్బందిచే సాఫ్ట్వేర్ కం సర్దార్ గా రెండు పనులు చేయించడం విత్ డ్రాయింగ్ ఎస్ డి ఎల్ యంత్రాల దగ్గర ఒకే సర్దారుచే పనులు చేయించడం వలన పని ఒత్తిడి వల్ల ప్రమాద లు జరుగుచున్నవి కనుక అలాంటి వారిపై యజమాన్యం ఈ వేధింపులకు గురి చేయడం అన్యాయమని తక్షణమే థిస్ మిస్ ఉత్తర్వులను సింగరేణి యజమాన్యం ఉపసంహరించుకో నీ గని మేనేజర్ పై చర్యలు తీసుకోవలి.

Also Read : బుగ్గపాడు ఫుడ్ పార్క్ పూర్తికి కేటీఆర్ హామి

అలాగే గని ప్రమాదానికి మైనింగ్ సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ తీసుకున్న తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకోవాలని అతని వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని టి.ఎన్.టి.యు.సి నాయకులు తెలిపారు లేనియెడల మైనింగ్ సిబ్బందిని ఏకం చేసి సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నా ము ఈ సమావేశంలో గద్దెల నారాయణ వెంబడి రాములు సిరికొండ కనకయ్య ఓ జీవరత్నం బొల్లు మల్లయ్య రమేష్ ఎండి హసన్ జి సదానందం భాష తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube