7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న డిస్నీ

7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న డిస్నీ

0
TMedia (Telugu News) :

7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న డిస్నీ

టీ మీడియా, ఫిబ్రవరి 9, లాస్‌ఏంజెల్స్‌: మల్టీనేషనల్‌ కంపెనీలను ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలతోపాటు బోయింగ్‌ వంటి విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో వినోద రంగంలో రారాజుగా వెలుగుతున్న వాల్డ్‌ డిస్నీ కూడా చేరింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 7 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. 5.5 బిలియన్ల ఖర్చులను ఆదా చేయడానికి, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడంలో భాగంగా కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నామని సంస్థ సీఈవో బాబ్‌ ఇగర్‌ వెల్లడించారు.

Also Read : బడ్జెట్‌ను లైవ్‌ టెలికాస్ట్‌ చేయండి

ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 3.6 శాతం అని చెప్పారు. కంపెనీలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిస్నీకి ఇటీవల సబ్‌స్క్రైబర్లు చాలా వరకు తగ్గిపోయారు. గత మూడు నెలల్లో డిస్నీ+కి వినియోగదారులు ఒక శాతం తగ్గి 168.1 మిలియన్‌కు పడిపోయారు.నష్టాలు పెరిగిపోతుండటంతో డిస్నీ.. ఇప్పటికే కొత్త నియామకాలను నిలిపివేసింది. అదేవిధంగా బిజినెస్‌ ట్రావెల్స్‌ను కూడా తగ్గించింది. పర్యటనల విషయంలో తప్పనిసరిగా తమ ఆమోదం పొందాలని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube