సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి

సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి

1
TMedia (Telugu News) :

సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి

టీ మీడియా,అక్టోబర్ 1,జనగామ :శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ జనగామ జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకున్నారు. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్థానిక నేతలు ముఖ్యమంత్రికి శాలువ కప్పి స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ కదులుతుండగా మహిళా కానిస్టేబుల్‌ జారి పడిపోయింది. అయినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయింది. సహా పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Also Read : 5జీ సేవలకు శ్రీకారం ప్రారంభించిన ప్రధాని

కాగా హనుమకొండ జిల్లా దామెర క్రాస్‌రోడ్డు, జాతీయ రహదారి-163లో నూతనంగా ఏర్పాటైన ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రిని శనివారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ మూడు గంటల పాటు గడుపుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలేరతారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube