స్టేడియంల నిర్మాణాలు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాల

స్టేడియంల నిర్మాణాలు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాల

1
TMedia (Telugu News) :

 

kmm coloctor
kmm coloctor
    • ఖమ్మం, సెప్టెంబర్ 22: జిల్లాలో స్టేడియంల నిర్మాణాలు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేడియంల పనుల్లో వేగం పెంచాలన్నారు. మధిర డిగ్రీ కళాశాల ఆవరణలో రూ. 2.65 కోట్లతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడా ప్రాంగణాల పనులు వచ్చే డిసెంబర్ కల్లా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో తేవాలన్నారు. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో టెన్నిస్ కోర్ట్ పునర్నిర్మాణ పనులు నవంబర్ ఆఖరికి పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో తేవాలన్నారు. వైరా స్టేడియంలో క్రొత్తగా రూ. 1.92 కోట్లతో మంజూరయిన అభివృద్ధి పనులకు టెండర్ ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు.

 also read: సంస్కృతి , సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ.

  • పనులకు సీజన్ కాబట్టి, ప్రతిరోజు పనులు జరిగేలా చర్యలు చేపడుతూ, రోజువారీ పనుల పురోగతిపై సమీక్ష చేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ది అధికారి పరంధామ రెడ్డి, పీఆర్ ఇఇ శ్రీనివాసరావు, జెడ్పి సిఇఓ అప్పారావు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube