విజేతలకు బహుమతులు అందజేశిన జెడ్పీటీసీ.

విజేతలకు బహుమతులు అందజేశిన జెడ్పీటీసీ.

1
TMedia (Telugu News) :

విజేతలకు బహుమతులు అందజేశిన జెడ్పీటీసీ.

టీ మీడియా అక్టోబర్ 06 చిన్నంబావి:-

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామంలో మండల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం జరిగింది ఇందులో 16 జట్లు పాల్గొనగా మొదటి బహుమతినీ వెలుగొండ గ్రామ జట్టు కైవసం చేసుకోవడం జరిగింది రెండో బహుమతి కొప్పునూరు బుల్స్ టీం కైవసం చేసుకుంది.మొదటి బహుమతి జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట రమణమ్మ చిన్నారెడ్డి సహకారంతో ఇవ్వడం జరిగింది.రెండో బహుమతి సర్పంచ్ నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డి సహకారంతో అందించడం జరిగింది. బెస్ట్ క్యాచర్ వెలగొండ గ్రామానికి చెందిన వెంకటేష్ కి ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్ షీల్డ్ ను అందించడం జరిగింది.బెస్ట్ రైడర్ కొప్పునూరు గ్రామానికి చెందిన కంది నరేష్ యాదవ్ కి సింగిల్ విండో డైరెక్టర్ డేగ శేఖర్ యాదవ్ షీల్డ్ ను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల తెరాస సీనియర్ నాయకులు చిన్నారెడ్డి,గ్రామ నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube