బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ

1
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరల పంపిణీ

టీ మీడియా, సెప్టెంబర్ 24, వనపర్తి బ్యూరో : మున్సిపాలిటీ పరిధిలోని 27, 28, 29, 30 వార్డుల లబ్ధిదారులకు స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో బతుకమ్మ చీరలు పంపిణీ శుక్రవారం మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ తీసుకువచ్చారు.

Also Read : మహిళల రక్షణ కోసం ఎల్లవేళలా షీ టీం సేవలు

గత ప్రభుత్వాలలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రధాన పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ జరుపుకునే విధంగా దోహదపడే కార్యక్రమం ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం చీరల పంపిణీ చేపట్టిన వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్ నాగన్న యాదవ్, గోపాల్ యాదవ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, వినోద్ గౌడ్, రాజలక్ష్మి, మంజు మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube