ముంపు ప్రాంతం నిర్వాసితులకు నిత్యవసరలుఅందజేయాలి

కలెక్టర్ను కలిసిన మాజీ ఎంపీ పెనుబల్లి మధు

1
TMedia (Telugu News) :

ముంపు ప్రాంతం నిర్వాసితులకు నిత్యవసరలుఅందజేయాలి

-కలెక్టర్ను కలిసిన మాజీ ఎంపీ పెనుబల్లి మధు.

టీ.మీడియా ,జూలై26, చింతూరు:

గోదావరి వరద ముంపు కు గురై సర్వం కోల్పోయిన ముంపు మండలాలు నిర్వాసితులకు అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందజేయాలని గుడారాలు వేసుకునేందుకు సరిపడా టార్పన్ లను అందజేయాలని మాజీ ఎంపీ పెనుబల్లి మధు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ తో మాట్లాడుతూ వరదల కు ఇళ్ళు నేలమట్టమయ్యాయి ప్రజలు నిర్వాసితులు అయ్యారని తెలిపారు. కూనవరం మండలం కొండ రాజుపేట గ్రామంలో నిర్వాసితులు రోడ్డు పై గుడారాలు వేసుకొని ఉన్నారని అక్కడే వారికి ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టి ఇవ్వాలన్నారు. ఎటపాక మండలం రాయని పేటలో ఆర్ అండ్ ఆర్ కార్డు నిర్మించారని అవి కూడా ముందుకు గురయ్యాయని ముంపు లేనిచోట పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇల్లు కట్టి ఇవ్వాలన్నారు. చింతూరు మండలంలో ఏ జి కోడేరు, ముకునూరు, మల్లె తోట, కొమ్మూరు. నిర్వాసిత గ్రామాలకు తక్షణమే నిత్యావసర వస్తువులు అందించారన్నారు.

 

Also Read :  : పేదల పైన జీఎస్టీ భారం ఏంటి

 

వి.ఆర్.పురం మండలంలో చొప్పెల్ల, రామవరం, జీడి గొప్ప, శ్రీ రామగిరి ఏవి గూడెం , తుష్టి వారి గూడెం, చుక్కపల్లి, గుర్రంపేట, కన్నాయిగూడెం గ్రామాల్లో కూడా ప్రజలు నిర్వాసితులయ్యారు అని వారికి కూడా నిత్య అసలు వెంటనే అందించాలని కలెక్టర్ ను కోరినారు. శబరి కొత్తగూడెం లో మూడు గ్రామాల ప్రజలు రోడ్డుకిరువైపులా గుడారాలు వేసుకొని ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ప్రాంతంలోనే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇప్పటికే తాము మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో ఎటపాక మండలం చింతూరు మండలం లోని చట్టి. కొవ్వూరు గ్రామాలలో మూడు రోజులుగా వరద బాధితులకు భోజనం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు కుంజా సీతారామయ్య, పల్లపు వెంకట్, మర్లపాటి నాగేశ్వరరావు. మండల కార్యదర్శి సీసం సురేష్. నాయకులు పొడియం లక్ష్మణ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube