విద్యార్థులకు టై ,బెల్టు, ఐడి కార్డుల పంపిణీ

విద్యార్థులకు టై ,బెల్టు, ఐడి కార్డుల పంపిణీ

2
TMedia (Telugu News) :

విద్యార్థులకు టై ,బెల్టు, ఐడి కార్డుల పంపిణీ

టీ మీడియా, అక్టోబర్ 20,జన్నారం : మండలంలోని చింతగూడ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు గ్రామస్తుల సహకారంతో టై, బెల్టు , ఐడి కార్డులను బుధవారం పాఠశాల లో విద్యార్థులకు గ్రామస్తులు పంపిణీ చేశారు. గత కొన్ని రోజుల నుండి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు టాయ్, బెల్టు, ఐడి కార్డులు లేకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు దృష్టికి తీసుకురావడంతో దాతలు స్పందించి డబ్బులు విరాళాల ద్వారా దాతలు అందించడంతో పిల్లల కు వీటిని అందించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు.

Also Read : మంత్రులు, ఎమ్మెల్యేలపై హెచ్చార్సీ లో ఫిర్యాదు

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గజ్జి తిరుపతి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మేడమురళీధర్ ,ప్రధాన కార్యదర్శి కస్తూరి దుబ్బయ్య ,గ్రామ పెద్దలు పొనుగోటి రామారావు, తాటి శ్రీనివాస్, పూదరి సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ ఆరె శిరీష్ కుమార్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయకాంత్ , ప్రైమరీ పాఠశాలఉపాధ్యాయులు రాంజీ ,శ్రీకాంత్ మమత,లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube