కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

1
TMedia (Telugu News) :

కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

టీ మీడియా, అక్టోబర్ 19,జయశంకర్ భూపాల పల్లి : మండల కేంద్రమైన స్థానిక తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవరాజo గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి గాను ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం గ్రూపు ల విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు తెలుగు అకాడమీ పంపించినటువంటి కొత్త పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

Also Read : మున్సిపాలిటీ లో అభివృద్ధి ప్రాణళిక కసరత్తు

అనంతరం ప్రిన్సిపాల్ శ్రీ దేవరాజు స విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలను చక్కగా సద్వినియోగం చేసుకొని పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube