నోటు పుస్తకాల పంపిణీ.

నోటు పుస్తకాల పంపిణీ.

1
TMedia (Telugu News) :

నోటు పుస్తకాల పంపిణీ.

టీ మీడియా, జూలై 29, జన్నారం:

మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల ఎంపియుపిఎస్ పాఠశాలలో గురువారం రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్ సమక్షంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం నుండి వచ్చే ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులను అందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.

 

Also Read : గోధావరిఖని లో ఘణంగా గోరింటాకు పండుగ

అలాగే పాఠశాలకు గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ ఫ్యాన్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బోర్లకుంట శంకర్ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube