అనాధాశ్రమానికి పరుపులు వితరణ
టి మీడియా,జూలై 27,ఖమ్మం :నగర టిఆర్ఎస్ నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఖమ్మం నగరంలోని అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నందు అనాధ పిల్లలకు పడుకోవడానికి పరుపులు అవసరం అని తెలపగా వాటిని ఈరోజు దానం చేయడం జరిగింది. మరియు వారికి మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
Also Read : బీజేపీ ఆధ్వర్యంలో పంప్ హౌస్ ముట్టడి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో రానున్న కాలంలో మరింత ప్రజాసేవ చేస్తానని, డివిజన్ అభివృద్ధికై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 46 వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి, నాయకులు బాల్దె నాగేశ్వరావు, వేముల విజయ్, కన్నం రమేష్,ఓరుగంటి మధు, కంకల రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.