టీ మీడీయా, నవంబర్30, పినపాక:
గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు జాన్సన్ సోషల్ సెంటర్ ఈ-బయ్యారం డివైన్ వర్డ్ మిషన్ నల్గొండ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫాదర్ యం సురేష్, ఆల్విన్ ఆధ్వర్యంలో 12 మంది పేద విద్యార్థులకు మంగళవారం సైకిళ్ళు పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల నుండి విద్యను అభ్యసించిన బాలికలను ప్రోత్సహించేందుకు డ్రాపవుట్స్ ను తగ్గించేందుకు,చదువుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఆనందరావు హాజరై మాట్లాడుతూ… జాన్ సోషల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఎన్నో వైద్య విద్య రంగాల్లో సేవలు చేస్తున్నారని వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో బ్రదర్స్ ఆల్బర్ట్, లూర్దం,బ్యాంకు ఉద్యోగి మోహన్ రావు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.