వృద్ధులకు దుప్పట్లు,దోమ తెరలు పంపిణీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 24,కరకగూడెం;

చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో వృద్ధులకు దుప్పట్లు,దోమ తెరలు సమత్ మోతె సర్పంచు ఇర్ప విజయ్ కుమార్ పంపిణీ చేశారు.
కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో శుక్రవారం ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్న వృద్ధులకు స్థానిక సర్పంచ్ విజయకుమార్,ఆ సంస్థ సభ్యులు బట్టా బిక్షపతి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఇర్ప విజయ్ కుమార్ మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంతంలో వృద్ధుల చలి తీవ్రత సమస్యలను గుర్తించి మానవతా అ దృక్పథంతో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచు చేను సాంబయ్య,పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్,తెరాస మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,గ్రామస్థులు సుతారి నాగేశ్వర రావు,మలకం నరేష్,గ్రామ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Distribution of blankets
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube