రామయ్య సన్నిధిలో మజ్జిగ పంపిణీ
టి మీడియా, మార్చి1, భద్రాచలం : భద్రాద్రి రామయ్య సన్నిధికి రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు బుధవారం నుంచి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఏఈ వో లు శ్రావణ్ కుమార్, భవాని రామకృష్ణ ప్రారంభించారు. సూపరిడెంట్ సాయిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, వేద పండితులు ప్రసాద్, కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.