క్యాలెండర్లు పంపిణీ
టీ మీడియా, జనవరి 16, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండల పరిధిలోని కొత్త సూగూరు గ్రామంలో సర్పంచ్ జూదం వెంకటేష్ ఆధ్వర్యంలో 2వ రోజు గడప గడపకు వెళ్లి నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేస్తూ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఉపసర్పంచ్ పల్లవి నాగేష్, వార్డు మెంబర్ ఫాక్రుద్దిన్,సుజాత సుధాకర్,రైతు సమితి అధ్యక్షులు జయన్న,గొడుగు బాలరాజు, ఆంజనేయులు, కురుమూర్తి, ఎల్లస్వామి, సీతయ్య,ధర్మరాజు, సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.