వలస గిరిజనులకు బట్టలు, బియ్యం పంపిణి .

0
TMedia (Telugu News) :

టీ, మీడియా, అక్టోబర్,27 పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని వలస గిరిజన గుంపులో ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ మణుగూరు వారి ఆధ్వర్యంలో బయ్యారం SI సూరి చేతుల మీదుగా 30 కుటుంబాలకు బియ్యం నిత్యావసర వస్తువుల బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా SI సూరి మాట్లాడుతూ వలస గ్రామాలకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అందించడం చాలా మంది కి ఉపయోగ పడుతుందని, ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం హర్షనియం అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు గుగులోత్ రాందాస్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ మరియు సంస్థ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Distribution of clothes and rice to the migrant tribes.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube