టీ మీడియా, డిసెంబర్23,మధిర:
మధిర మండలం నిధానపురం గ్రామస్థులు డాక్టర్ యర్రం.వీరారెడ్డి గారి కుమారుడు ఎన్ఆర్ఐ యర్రం శ్రీనివాసరెడ్డి 65,000రూ మరియు చేతన గ్రూప్ ఫౌండేషన్ 55,000రూ వారి సహకారం తో మొత్తం 1,20,000 రూ విలువ చేసే 31 డెస్క్ బల్లలను ప్రాధమిక పాఠశాలకు,2 బల్లలు అంగన్ వాడి కి ఎం ఈ ఓ ప్రభాకర్, యు ఆర్ డి శాస్త్రి చేతుల మీదుగా అందచేశారు.ఈ సందర్భం గా ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ… సొంత గ్రామానికి సేవ చేయాలనే తలంపుతో ముందుకు వొచ్చి న దాతలను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ బల్లలు విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడతాయ్ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బాద. కృష్ణారెడ్డి, ఎంపీటీసీ మరియమ్మ, కాంప్లెక్స్ హెచ్.ఎం సాయి కృష్ణమా చార్యులు, విద్యాకమిటీ చైర్మన్ లు నాగేందర్ రెడ్డి,నర్సిరెడ్డి గ్రామ పెద్దలు యర్రం.కన్నారెడ్డి,యర్రం.వీరారెడ్డి,రఘురామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.