ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫ్యాన్లు,గోడ గడియారం వితరణ

0
TMedia (Telugu News) :

టీ మీడీయా,డిసెంబర్ 8,పినపాక;

పినపాక మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి భార్గవ ఆటోమొబైల్స్ తరపున పన్నెండు వేల విలువైన ఐదు సీలింగ్ ఫ్యాన్లు,గోడ గడియారంను ఆస్పత్రి సిబ్బందికి అందజేశారు.
ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ… జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుతు సౌకర్యం ఉన్నప్పటికీ సీలింగ్ ఫ్యాన్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది తమ దృష్టికి తీసుకరావడంతో ఐదు సీలింగ్ ఫ్యాన్లు,గడియారం ఆసుపత్రి సిబ్బందికి అందజేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
కరోనా కష్టకాలంలో వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు.ఆస్పత్రి అభివృద్ధి కోసం వికాస్ అగ్రి ఫౌండేషన్ నుండి గతంలో రూపాయలు 5,000 వెచ్చించి రోగుల సౌకర్యార్థం కుర్చీలను కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ భార్గవ ఆటోమొబైల్స్ ప్రొప్రైటర్ నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ టి వెంకటేశ్వర్లు ,ఫార్మాసిస్ట్ పి రవీంద్ర బాబు ,హెచ్ ఎ బి నాగమల్లేశ్వరరావు, హెచ్ ఏ ఎఫ్ కే వెంకట లక్ష్మి, ఆస్పత్రి సిబ్బంది రాణి, భూలక్ష్మి, లక్ష్మీ మోటార్స్ ఏడూళ్ల బయ్యారం ప్రొప్రయిటర్ భార్గవ్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Distribution of fans and wall clock to the primary health center.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube