ముంపుకుటుంబలకు సరుకులు పంపిణీ

ముంపుకుటుంబలకు సరుకులు పంపిణీ

1
TMedia (Telugu News) :

ముంపుకుటుంబలకు సరుకులు పంపిణీ

టి మీడియా, జులై 18, వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మొర్రవానిగూడెం, అబ్బాయిగూడెం గ్రామాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన 105 కుటుంబలకు శ్వేత దళం వైట్ ఆర్మీ , గోదావరి గిరిజన ఇసుక క్వారీ సొసైటీ మొర్రవానిగూడెం అధ్వర్యంలో మోర్రవాని గూడెం, అబ్బాయిగూడెం వరద బాధితులకు తక్షణ సహాయర్ధం 150 కేజీల బియ్యం, 80 కేజీల ఉల్లిగడ్డలు, 80 కేజీల టమాట, 40 కేజీల కంది పప్పు, 40 లీటర్ల నూనె, ఉప్పు కారం పసుపు మొదలగు నిత్యవసర సరుకులు 105 బాధిత కుటుంబాలకు చింత సర్వేశ్ సంస్థ కన్వీనర్ అధ్వర్యంలో అందజేయడం జరిగింది.

Also Read : గోడకూలి గుడుచేదిరే..

ఈ కార్యక్రమంలో మొర్రవానిగూడెం ఇసుక క్వారీ అధ్యక్ష, కార్యదర్శులు మొర్రం రామలక్ష్మి , నాయోమి, సర్పంచ్ మడకం సారయ్య, సంస్థ సభ్యులు చెలే ఆంజనేయులు, తుమ్మ నాగరాజు, ముర్రం రాజేష్ , రంజిత్, రమేష్ తదతరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube