ఇంటింటికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

-తోలి రోజు 98-చెక్కులకు రు.98 లక్షలు పంపిణీ

0
TMedia (Telugu News) :

ఇంటింటికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

-తోలి రోజు 98-చెక్కులకు రు.98 లక్షలు పంపిణీ

-తమ ఇంటికే చెక్కును ఇవ్వడం పట్లకృతజ్ఞతలు

టీ మీడియా, ఫిబ్రవరి 14,ఖమ్మం : కార్పోరేషన్ పరిధిలో మంజూరైన 202 చెక్కులను రెండు రోజుల పాటు పంపిణీ చేయలని తలంచారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు ఉదయం 2వ టౌన్, మధ్యాహ్నం 3వ టౌన్ నందు మొత్తం 98 చెక్కులను గాను రూ.98 లక్షల విలువైన చెక్కులను మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్లి లబ్దిదారులకు స్వయంగా పంపిణీ చేశారు.

ఆయా లబ్దిదారులకు మంజూరైన రూ.లక్ష చెక్కతో పాటు చీర, పండ్లు అందజేశారు. దీంతో లబ్ధిదారులు తమ వద్దకే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వయంగా చెక్కును ఇవ్వడం పట్ల మంత్రి పువ్వాడ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద ఇంటి అడపిల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడొద్దు అనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ఈ నిర్ణయం తీసుకుని నిరవధిక గా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఎలాంటి సంక్షోభం వచ్చిన నేటి వరకు సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా పథకాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు.

Also Read : పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గారికి మనం అండగా నిలివాల్సిన అవసరం ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే చెక్కులను విడుదల చేసినందుకు లబ్ధిదారుల కుటుంబాలు ప్రభుత్వంకు రుణపడి ఉండాలన్నారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు దేశంలోని ఎక్కడ లేవని, ఇచే ధైర్యం కూడా చెయ్యలేరు అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఆదర్శమని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube