అటకెక్కన దళితులకు భూ పంపిణీ

మాట ఇచ్చి మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం

0
TMedia (Telugu News) :

అటకెక్కన దళితులకు భూ పంపిణీ

– మాట ఇచ్చి మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం

టీ మీడియా, నవంబర్ 23, వనపర్తి బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 2014 లో టిఆర్ఎస్ మానిఫెస్టోలో 2014 లో పంద్రాగస్టు నాడు గోల్కోండ కోట నుండి 2015 మార్చి 17న అసెంబ్లీ సాక్షిగా భూమిలేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి పంపిణీ ప్రారంభిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన కెసిఆర్ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల్లో 6,242 కుటుంబాలకు 15,571 ఎకరాలు మాత్రమే పంపిణీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల్లో సాగుకు యోగ్యమైన భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని ఉన్నా అందుకు విరుద్ధంగా సగానికి పైగా సాగుకు అనుకూలంగా లేని రాళ్ళు, రప్పల భూమి ఇచ్చినారు. సాగు నీటి వసతి లేకపోవటం పెట్టుబడి సమకూర్చుకునే శక్తి లేకపోవటం వల్ల దళితులు తమకు కెటాయించిన భూమి సాగు చేసుకోలేక పోతున్నారని క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా వచ్చిన పత్రికా కథనాల ద్వారా తెలుస్తున్నది.

Also Read : పల్నాడులో జిల్లాలో ముగ్గురి దారుణ హత్య..

ఇందుకు సంబందించిన ఒకటి రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని బానాజిపేటకు చెందిన కుక్కమూడి లలిత, శనిగపురం స్వప్న దళితులకు భూపంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమములో స్వయంగా కె.సి.ఆర్. చేతుల మీదుగా భూమి పట్టా తీసుకొని పొందిన సంతోషం ఒక్క రోజు మిగల్లేదు. అది ఒక భూస్వామికి చెందిన వివాదస్పద భూమి అని తెలుసుకొని కన్నీళ్ల పర్యంత మయ్యారు. చివరకు ఏదో విధంగా భూమి చేతికందినా సాగుకు అనుకూలంగా లేదని వాపోతున్నారు. శనిగరపు స్వప్నకు ఇచ్చిన భూమిలో 10 గుంటలు పల్లె ప్రకృతి వనం, మరో 10 గుంటలు డంపింగ్ యార్డు కోసం బలవంతంగా లాక్కొన్నారు. అదే విధంగా చంద్రయ్యపల్లెకు చెందిన వారి పరిస్థితి అంతే. ఎన్నో సంవత్సరాలుగా సాగులో లేని ‘బంచరాయి’ కావటంతో అప్పుచేసి లక్షలు గుమ్మరించినా బోరుబావుల నుండి నీళ్లు రాకపోవటంతో భూమి వచ్చుడేమో కాని అప్పుల పాలయ్యారు. ఇక మహబూబాబాద్ చిన్న గూడూరు చెందిన పిల్లి శ్రీరాములుతో పాటు 50మందిది మరో వ్యథ. 50 మంది దళితులకు గ్రామం సర్వే నెంబరు 16లో సాగుకు అనుకూలమైన భూమి ఇస్తామని చెప్పిన రెవెన్యూ అధికారులు అదే భూస్వామికి చెందిన రాళ్లు, రప్పలతో సాగుకు పనికిరాని భూమి, చెరువు శిఖం భూమి ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల విభజన, ప్రభుత్వ విధానాలతో భూముల ధరలకు రెక్కలు వచ్చి దళితుల కొరకు భూమి కొనుగోలు చేయలేమని ఎస్సీ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన దళితులకు మూడెకరాల భూమి అంతే గుట్టుచప్పుడు కాకుండా ఆగిపోయింది.

Also Read : భూ ప్రకంపనలతో మరోసారి వణికిన హిమాలయ దేశం

మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు పంచిన అసైన్డ్ భూములు పెద్ద మొత్తంలో అన్యాక్రాంతమైనాయి. 2014 తర్వాతి కాలంలో దళితులకు చెందిన అసైన్డ్ భూములల్లో 30వేల ఎకరాలు వివిధ అవసరాల కోసం ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్నట్లు పత్రికా కథనాల ద్వారా వెల్లడయింది. అసైన్డ్ భూముల చట్టం – 1977 ప్రకారం భూముల అమ్మకం, కొనుగోలు చెల్లవు. అయినా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి అసైన్డ్ భూములకూ పట్టాలు ఇస్తున్న సంఘటనలు ఎన్నెన్నో. 2018-19 లో ఉంద ఎస్.సి. యువతకై క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ అనే మరో పథకం ముందుకు వచ్చింది. రూ.62 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఎవరికీ సహాయం అందించిన దాఖలా లేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube