హర్సెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ కిట్ల పంపిణీ

0
TMedia (Telugu News) :

– – హర్సెల్ఫ్ సొసైటీ ప్రజా సేవలో ముందుంటుంది

టీ మీడియా, డిసెంబర్ 7,మహానంది:

హర్సెల్ఫ్ సొసైటీ ఆధ్వర్యంలో గూంజ్ సంస్థ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆశా వర్కర్లకు మెడికల్ కిట్లు అందిస్తున్నామని హర్సెల్ఫ్ సొసైటీ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఈ మెడికల్ కిట్లను ఆశ వర్కర్లకు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హర్సెల్ఫ్ సొసైటీ డైరెక్టర్ మాట్లాడుతూ కరోనా వారియర్లుగా ఉంటూ వాక్సినేషన్ ప్రక్రియలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ హర్సెల్ఫ్ సొసైటీ అందిస్తున్న సేవలో భాగంగా ఈ మెడికల్ కిట్లు అందించడం చాలా ఉపయోగకరమైనదని చెప్పారు. అంతే కాకుండా సుమారుగా 100 కు పైగా మెడికల్ కిట్లను ఆశా వర్కర్లకు మరియు ఏఎన్ఎమ్ లకు అందజేయడం చాలా ఉపయోగకరం అన్నారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ తో పాటు డాక్టర్ వందన మరియు హర్సెల్ఫ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ రంగారావు, మరియు హర్సెల్ఫ్ సొసైటీ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Distribution of medical kits under the auspices of the Hurcelf Society.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube