మందుల కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ
టీ మీడియా, ఫిబ్రవరి 13, తిరుమలాయపాలెం : తిరుమలయపాలెం మండల కేంద్రం లోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఫైలేరియా బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరోగ్య సంరక్షణలో భాగంగా ఎంపీపీ బోడ. మంగీలాల్ నాయక్ మెడికల్ కిట్. పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫైలేరియా బాధితులు ఆత్మన్యూనతా భావానికి లోను కావద్దని అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ ఫైలేరియా బాధితులకు పెన్షన్ సౌకర్యం కల్పించి వారికి భరోసా కల్పిస్తున్నారని వారిని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అలాగే ఫైలేరియా నివారణ చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జయరాం ఎంపీ ఓ రాజేశ్వరి వైద్యాధికారి రామారావు మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ సైఫుద్దిన్ కొక్కిరేణి ఎంపీటీసీ గుగ్గిల్ల అంబేడ్కర్ తిరుమలాయపాలెం గ్రామ సర్పంచ్ కొండబాల.వెంకటేశ్వర్లు కొక్కిరేణి గ్రామ సర్పంచ్ గంట నిర్మలకృష్ణ. నాయకులు సామ వెంకట్ రెడ్డి బాణాల బస్వా రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.