మందుల కిట్ల పంపిణీ
టీ మీడియా, నవంబర్ 21, మధిర : మాటూరుపేట పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో నాన్ కమ్యూనికేబుల్ డిసేబుల్ మందుల కిట్ ల పంపిణీ కార్యక్రమంను షుగర్, బిపి ఉన్న వారికి అన్ని గ్రామాల ఆశా కార్యకర్తల ద్వారా నెలకి సరిపోను మందులు ఈ కిట్ బ్యాగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసేబుల్ మందుల కిట్ ద్వారా ఉన్నతమైన జీవనానికి ఆరోగ్యకరమైన అలవాట్లు గురించి, అధిక రక్తపోటు,చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే కలిగే దుష్పరిణామాల గురించి డాక్టర్ సూచించిన మందులు చదువురాని వారు కూడా సులువైన పద్ధతిలో గ్రహించుటకు ఉదయం మధ్యాహ్నం, రాత్రి, రంగుల కవర్స్ ఏర్పాటు చేయడం జరిగినది. అలానే ఉదయం ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట సేపు నడవడం, యోగా కార్యక్రమాలు చేయడం నడక ద్వారానే 90 శాతం షుగర్ వ్యాధిని అదుపులో పెట్టచ్చని అన్నారు.