టీ మీడియా నవంబర్ 5 వనపర్తి : వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో దీపావళి కానుకగా విద్యాభాసం శుభప్రదంగా సాగాలన్న సంకల్పంతో విద్యార్థులందరికీ నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. మహబూబ్ నగర్లో ఉన్న అజ్ఞాతదాత ప్రధానోపాధ్యాయులు అతీల్అహ్మద్ అభ్యర్థన మేరకు అజ్జకొల్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 15 వేల రూపాయల విలువగల లాంగ్ నోట్ బుక్, 1500 రూపాయల పెన్నులు బహూకరించారు. ఎస్ఎంసి చైర్మన్ బి .రాజు మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు కోసం శ్రమించే ఉపాధ్యాయులు కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి రాటుదేలి ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలని హితబోధ చేశారు.
పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా వారికి ఒక్కొక్కరికి 7 నోట్ బుక్స్, పెన్నులు బహూకరిస్తున్నమని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. మిగతా విద్యార్థులందరికీ నోట్ బుక్స్, పెన్స్ పంపించడం జరిగింది.
పాఠశాలలో ప్రతి తరగతిలో 90% హాజరైన విద్యార్థికి, క్లాస్ లీడర్ కి, ధాన్యం కార్యక్రమం నిర్వహణ విద్యార్థులకు, హరితహారం కార్యక్రమం బాధ్యులకు కూడా ప్రధానోపాధ్యాయులు ప్రతినెల బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు మక్బూల్ అహ్మద్ పాల్గొన్నారు. నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన దాతకు పాఠశాల సిబ్బంది విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దాత ఆశయాలు నెరవేర్చే చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తా మని విద్యార్థులు తెలిపారు.
